అసంపూర్తి రోడ్డుతో అవస్థలు
ABN , Publish Date - May 27 , 2026 | 12:05 AM
పాడేరు- చింతపల్లి మెయిన్‌రోడ్డులో కాన్వెంట్ కూడలి నుంచి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి సుమారు ఒక కిలోమీటరు రోడ్డు పది నెలలుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గతేడాది జూన్ నెలలో పెన్షన్ పంపిణీకి సీఎం చంద్రబాబునాయుడు లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి గ్రామానికి వస్తారని ఈ రోడ్డు అభివృద్ధి పనులను అధికారులు ప్రారంభించారు.
- గత ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించి వదిలేసిన వైనం
- వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు
పాడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి): పాడేరు- చింతపల్లి మెయిన్‌రోడ్డులో కాన్వెంట్ కూడలి నుంచి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి సుమారు ఒక కిలోమీటరు రోడ్డు పది నెలలుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. గతేడాది జూన్ నెలలో పెన్షన్ పంపిణీకి సీఎం చంద్రబాబునాయుడు లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి గ్రామానికి వస్తారని ఈ రోడ్డు అభివృద్ధి పనులను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ మార్గంలో సీఎం కార్యక్రమం లేకపోవడంతో రోడ్డు పనులను పూర్తి చేయకుండా అధికారులు వదిలేశారు. గతేడాది జూన్ నుంచి అసంపూర్తి పనులతో రోడ్డును వదిలేయడంతో ప్రస్తుతం అది ప్రమాదభరితంగా మారింది. గతంలో అధికంగా వర్షాలు కురవడంతో మెటల్ పరిచి ఉన్న రోడ్డుకు ఇరువైపులా అంచులు కొట్టుకుపోయి, రాళ్లు తేలిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు కార్లతో పాటు ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా వంజంగి హిల్స్‌కు పర్యాటకులు రాకపోకలు సాగించే క్రమంలోనూ అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.