రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ప్రాబబుల్స్ ఎంపిక
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:52 AM
అనంతపురంలో ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు జరిగే అంతర్ జిల్లా సీనియర్ మెన్ హాకీ టోర్నమెంటులో అనకాపల్లి జిల్లా నుంచి పాల్గొనే జట్టు ఎంపిక పోటీలను ఆదివారం ఇక్కడ రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో నిర్వహించారు.
ఎలమంచిలి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు జరిగే అంతర్ జిల్లా సీనియర్ మెన్ హాకీ టోర్నమెంటులో అనకాపల్లి జిల్లా నుంచి పాల్గొనే జట్టు ఎంపిక పోటీలను ఆదివారం ఇక్కడ రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో నిర్వహించారు. క్రీడాకారుల స్కిల్, ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసి, 25 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేసినట్టు హాకీ అసోసియేషన్ జిల్లా కన్వీనరు కొఠారు నరేశ్ తెలిపారు. వీరిలో 18 మంది క్రీడాకారులతో జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే జట్టు 10వ తేదీన ఇక్కడి నుంచి అనంతపురానికి బయలుదేరుతుందన్నారు. సెలక్టర్లుగా దాసరి మహేశ్, మజ్జి గణేశ్ వ్యవహరించారు.