ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడుపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:19 AM
సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకుల అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు జిల్లా మీదుగా నడిచే అన్ని ట్రావెల్స్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని జిల్లా రవాణా అధికారి గోపిశెట్టి మనోహర్ హెచ్చరించారు.
ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
డీటీవో గోపిశెట్టి మనోహర్
అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్ 92816 07001
అనకాపల్లి రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకుల అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు జిల్లా మీదుగా నడిచే అన్ని ట్రావెల్స్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని జిల్లా రవాణా అధికారి గోపిశెట్టి మనోహర్ హెచ్చరించారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ బస్సు చార్జీలకంటే గరిష్ఠంగా 50 శాతం మాత్రమే అధికంగా తీసుకోవాలని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఏ ట్రావెల్స్ యాజమాన్యం అయినా ఇంతకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే రవాణా శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 92816 07001కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించారు.
ఆర్‌టీజీఎస్ ద్వారా అభిబస్, రెడ్‌బస్ వంటి యాప్‌ల ద్వారా టికెట్ల ధరను నిరంతరం పర్యవేక్షిస్తుంటామని, అధిక ధరలు వసూలు చేసే బస్సు యజమానులపై కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రైవేటు బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని డీటీవో మనోహర్ తెలిపారు.