Share News

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టెర్రర్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:19 AM

సమయం.. ఆదివారం వేకువజాము 4 గంటలు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడమే కాకుండా ఒకరిపై మరొకరు పడిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆర్తనాదాలు చేశారు. బస్సు బోల్తా పడిందని గుర్తించి భయాందోళన చెందారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన 18 మందికి ప్రాథమిక చికిత్స చేయించి వేరే బస్సులో గమ్యస్థానానికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టెర్రర్‌
నక్కపల్లి హైవే పక్కన బోల్తా పడిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

- నక్కపల్లి వద్ద బోల్తా పడడంతో 20 మందికి గాయాలు

- విద్యుత్‌ సరఫరా లేని సమయంలో వైర్లు తెగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం

నక్కపల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): సమయం.. ఆదివారం వేకువజాము 4 గంటలు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడమే కాకుండా ఒకరిపై మరొకరు పడిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆర్తనాదాలు చేశారు. బస్సు బోల్తా పడిందని గుర్తించి భయాందోళన చెందారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన 18 మందికి ప్రాథమిక చికిత్స చేయించి వేరే బస్సులో గమ్యస్థానానికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు.

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో శనివారం సాయంత్రం బయలుదేరిన శ్యామౌలీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నక్కపల్లి వారపుసంత హైవే పక్కన బోల్తా పడడంతో 20 మంది గాయపడ్డారు. అయితే బస్సు బోల్తా పడిన చోట లోతు గాని, కాలువ గానీ లేకపోవడం, విద్యుత్‌ సరఫరా లేని సమయంలో వైర్లు తెగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ల సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు. గాయపడిన ప్రయాణికులను నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. వీరిలో మోహన్‌ లోకేశ్‌, మునిస్వామి అనే ఇద్దరికి ప్రాఽథమిక చికిత్స చేసిన అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను స్థానిక హాస్టల్‌ వద్ద వుంచారు. అనంతరం శ్యామౌలీ కంపెనీకి చెందిన మరో బస్సులో ప్రయాణికులను చెన్నై తరలించారు.

గాయపడిన వారు వీరే..

ఈ బస్సు ప్రమాదంలో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో కొందరు ప్రాథమిక చికిత్స అనంతరం వేరే బస్సులో చెన్నై వెళ్లిపోయారు. గాయపడిన వారిలో జి.మహాలక్ష్మి, ఎం.చంద్ర నాయక్‌, కె.ఉమా మహేశ్వరరావు, బీఎస్‌ శ్రీనివాస్‌, నిర్మల్‌కుమార్‌, సుపిన్‌ ప్రదాన్‌, మోహన్‌ లోకేశ్‌, మునిస్వామి, జ్యోతి, దీపదాస్‌, కార్తీక్‌, రమేశ్‌, చంద్రిక సహా మరో ఏడుగురు ఉన్నారు. నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 01:19 AM