పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:22 AM
మేయర్, మునిసిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్ స్వాగతించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా బలమైన, స్వచ్ఛమైన నాయకత్వాన్ని ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. అవసరమైనచోట సేవా భావం ఉన్న తటస్థులు, సమాజంలో మంచి సంబంధాలు ఉన్న సివిల్ సొసైటీ ప్రతినిధుల అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం 59 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.34 లక్షల విలువైన చెక్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మాటల్లో కాకుండా బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కేడర్ కలిసి పనిచేయాలన్నారు.
అవసరమైనచోట్ల తటస్థులకు అవకాశం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మకం
‘రాయగడ’ బదిలీ అయిన
రైల్వే ఉద్యోగుల సమస్యపై జీఎంతో చర్చిస్తా
ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):
మేయర్, మునిసిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్ స్వాగతించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా బలమైన, స్వచ్ఛమైన నాయకత్వాన్ని ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. అవసరమైనచోట సేవా భావం ఉన్న తటస్థులు, సమాజంలో మంచి సంబంధాలు ఉన్న సివిల్ సొసైటీ ప్రతినిధుల అభ్యర్థిత్వాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం 59 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.34 లక్షల విలువైన చెక్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మాటల్లో కాకుండా బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కేడర్ కలిసి పనిచేయాలన్నారు.
రాయగడ రైల్వే డివిజన్‌కు కేటాయించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 800 మంది ఉద్యోగులు తమను విశాఖకు బదిలీ చేయడంతోపాటు సీనియారిటీ కాపాడాలని కోరారని ఎంపీ చెప్పారు. ఈ సమస్యపై ఇప్పటికే వారంతా తనను కలిశారని పేర్కొంటూ దీనిపై రైల్వే జీఎంతో చర్చిస్తానన్నారు. అందరికీ ఒకేసారి కాకపోయినా వీలైనంత వరకూ న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. విశాఖ విమానాశ్రయ కాంట్రాక్టు ఉద్యోగుల ఉపాధి విషయంలో ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల కోసం వారిని రిఫర్ చేసినప్పటికీ అర్హత, వయస్సు వంటి నిబంధనల కారణంగా అందరికీ అవకాశం రాలేదన్నారు. దీంతో విశాఖ హోటలీయర్స్ అసోసియేషన్, ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో 30 సంస్థలు నిర్వహించిన జాబ్‌మేళాకు 450 మంది హాజరుకాగా, 130 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మరో 100 నుంచి 150 మందిని తదుపరి ఇంటర్వ్యూకు పిలవడం జరిగిందన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉండే ప్రీపెయిడ్ టాక్సీ కౌంటర్‌ను భోగాపురం ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో పార్కింగ్ ఫీజు వసూలులో ఇబ్బందులున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. టెర్మినల్ వద్దకు వెళ్లే వాహనం ఎనిమిది నిమిషాలు ఉండేందుకు అనుమతి ఉందని, ఆ తరువాత ప్రతి గంటకు ఫీజు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన భీశెట్టి వసంతక్ష్మి, గొలగాని వీరారావు, ఈతలపాక సుజాత, ఆకిరెడ్డి జగదీష్, ఈసరసు వాసు, సంగు వాసు, తదితరులు పాల్గొన్నారు.