Share News

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:43 PM

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి స్థానిక మోదకొండమ్మ ఆలయం వద్ద టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆశీర్వాద దీప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
ఆశీర్వాద దీప కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ నాయకులు

పాడేరురూరల్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి స్థానిక మోదకొండమ్మ ఆలయం వద్ద టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆశీర్వాద దీప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి ప్రధాని మోదీకి ఆదివాసీల తరపున 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నరేంద్ర మోదీ జన్మదిన కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 13 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధిలో నరేంద్ర మోది భాగస్వామ్యం కీలకమైందన్నారు. ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్ర శిఖరాన నిలపాలన్న ఆయన ఆకాంక్ష భారతీయులు అంతా గర్వించదగ్గదన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా ఆయన వేసిన అడుగులకు ప్రపంచం యావత్‌ నీరాజనం పలికిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎం.మణికుమారి, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఎం.శాంతకుమారి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:44 PM