Share News

నూకాంబిక అమ్మవారికి బంగారు వస్తువుల బహూకరణ

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:05 AM

స్థానిక నూకాంబిక అమ్మవారికి విశాఖకు చెందిన సూర్య ట్రావెల్స్‌ అధినేత శెట్టిపల్లి సుబ్బారావు, చైతన్య స్రవంతి దంపతులు బంగారం వస్తువులను బహూకరించారు.

నూకాంబిక అమ్మవారికి బంగారు వస్తువుల బహూకరణ

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

స్థానిక నూకాంబిక అమ్మవారికి విశాఖకు చెందిన సూర్య ట్రావెల్స్‌ అధినేత శెట్టిపల్లి సుబ్బారావు, చైతన్య స్రవంతి దంపతులు బంగారం వస్తువులను బహూకరించారు. 73 గ్రాముల ఎర్ర, తెలుపు పొడులతో కూడిన నామం, ఎర్ర పొడులతో కూడిన బొట్టును సోమవారం ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు నూకాంబిక అమ్మవారిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 01:05 AM