కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:10 PM
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నమోదువుతున్న తరుణంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.
జిల్లాలో నాలుగు ఆస్పత్రుల్లో 25 పడకలు సిద్ధం
పాడేరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు నమోదువుతున్న తరుణంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని ప్రధానమైన నాలుగు ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 25 పడకలను సిద్ధం చేసింది. జిల్లాలోని వైద్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 10, ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 7, అరకులోయ ఏరియా ఆస్పత్రిలో 5, చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 3 పడకలను సిద్ధం చేశారు. ఎటువంటి కొవిడ్ అనుమానిత కేసులు వెలుగులోకి వచ్చినా తక్షణమే స్పందించి అవసరమైన పరీక్షలు, చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రజలు సైతం కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలని వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు.