Share News

మునిసిపల్‌ ఎన్నిలకు సన్నాహాలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:33 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నర్సీపట్నం మునిసిపల్‌ ఎన్నికలకు స్థానిక అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేసినా... ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించడంతో మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సరేంద్ర ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపాలిటీలో ప్రస్తుతం 28 వార్డుల్లో 56 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

మునిసిపల్‌ ఎన్నిలకు సన్నాహాలు
పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్‌

సిబ్బంది నియామకాలు పూర్తి

3న ముసాయిదా ఓటరు జాబితాల విడుదల

నర్సీపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నర్సీపట్నం మునిసిపల్‌ ఎన్నికలకు స్థానిక అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేసినా... ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించడంతో మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సరేంద్ర ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపాలిటీలో ప్రస్తుతం 28 వార్డుల్లో 56 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. కమిషనర్‌ మంగళవారం పలు పోలింగ్‌ కేంద్రాల భవనాలను తనిఖీ చేసి, వాటి స్థితిగతులు, సదుపాయాలను పరిశీలించారు. బ్యాలట్‌ బాక్సులు ఎన్ని అవసరం అవసరం అవుతాయో నిర్ధారించి, నివేదిక తయారు చేస్తున్నారు. కాగా వార్డుల పునర్విభజన అంశంపై హైకోర్టు తీర్పు రిజర్వులో ఉండడంతో ఎన్నికలు జరిగేది 28 వార్డులకా? 40 వార్డులకా? అన్నది సందిగ్ధంలో ఉన్నది. ప్రస్తుతానికి 40 వార్డులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యింది. సెప్టెంబరు 3న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. వీటిపై ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, తుది జాబితాను ప్రకటిస్తారు.

Updated Date - Aug 26 , 2026 | 12:33 AM