స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:20 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,350 పోలింగ్ కేంద్రాలు
విశాఖపట్నంలో 203, అనకాపల్లిలో 1,530, అల్లూరి జిల్లాలో 617
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మూడు జిల్లాల పరిధిలోని 39 మండలాలకు సంబంధించి 2,350 పోలింగ్ కేంద్రాలతో తుది జాబితాను శనివారం జిల్లాపరిషత్ అధికారులు విడుదల చేశారు. ఈమేరకు విశాఖపట్నం జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్ సంయుక్తంగా నోటీసు బోర్డులో తుది జాబితాను ప్రదర్శించారు. మూడు జిల్లాల్లోని అన్ని మండల అభివృద్ధి కార్యాలయాల్లో తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లాలో 203, అనకాపల్లి జిల్లాలో 1,530, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 617 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. మండలాల వారీగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజల అవగాహన, పరిశీలన నిమిత్తం నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.
అల్లూరి జిల్లాలో పోలింగ్ కేంద్రాలు
----------------------------------------------------------------
మండలం ఎంపీటీసీ స్థానాలు పోలింగ్ కేంద్రాలు
-----------------------------------------------------------------
అనంతగిరి 14 49
అరకులోయ 16 47
చింతపల్లి 20 77
డుంబ్రిగుడ 14 52
జి.మాడుగుల 15 52
గూడెంకొత్తవీధి 18 60
హుకుంపేట 15 58
కొయ్యూరు 14 60
ముంచంగిపుటు 14 45
పాడేరు 17 63
పెదబయలు 15 54
---------------------------------------------------------------
మొత్తం 172 617
---------------------------------------------------------------