Share News

గూగుల్‌ శంకుస్థాపనకు ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:58 AM

మండలంలోని తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి ఈనెల 28వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

గూగుల్‌ శంకుస్థాపనకు ఏర్పాట్లు

ఒకవైపు భూమి చదును పనులు

మరోవైపు సభావేదిక, హాలు ఏర్పాటు

ఆనందపురం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి ఈనెల 28వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా సభ కూడా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పనులు చకాచకా సాగుతున్నాయి. ఒకవైపు గూగుల్‌కు కేటాయించిన భూములను మిషన్లు పెట్టి చదును చేయిస్తున్నారు. మరోవైపు శంకుస్థాపన అనంతరం నిర్వహించే సభకోసం భారీ వేదిక, హాలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీస్‌ బందోబస్తు ఉంది. అక్కడకు ఎవరినీ అనుమతించడం లేదు.

Updated Date - Apr 24 , 2026 | 12:58 AM