Share News

గర్భిణికి తప్పని డోలీమోత

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:27 AM

మండలంలోని నక్కలబంద గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి చెందిన నిండు గర్భిణిని డోలీలో కిలోమీటరు మేర తరలించాల్సిన దుస్థితి నెలకొంది.

గర్భిణికి తప్పని డోలీమోత
నిండు గర్భిణిని ఆదివారం రాత్రి డోలీలో మోసుకెళుతున్న దృశ్యం

నక్కలబంద గ్రామానికి రహదారి లేక ఇబ్బందులు

గూడెంకొత్తవీధి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నక్కలబంద గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి చెందిన నిండు గర్భిణిని డోలీలో కిలోమీటరు మేర తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని దేవరాపల్లి పంచాయతీ నక్కలబంద గ్రామానికి చెందిన నిండు గర్భిణి సంధ్యకు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు డోలీలో కొండలు, వాగులు దాటుకుంటూ లక్కవరం వద్ద ఉన్న అంబులెన్సు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి అంబులెన్సులో గూడెంకొత్తవీధి పీహెచ్‌సీకి తరలించారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 12:27 AM