Share News

సర్‌ అల్లూరి జిల్లా పరిశీలకుడుగా ప్రవీణ్‌ఆదిత్య

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:40 PM

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ జిల్లా పరిశీలకుడుగా ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ(ఐఏఎస్‌) సీవీ.ప్రవీణ్‌ఆదిత్యను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సర్‌ అల్లూరి జిల్లా పరిశీలకుడుగా ప్రవీణ్‌ఆదిత్య

పాడేరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ జిల్లా పరిశీలకుడుగా ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ(ఐఏఎస్‌) సీవీ.ప్రవీణ్‌ఆదిత్యను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితాల నవీకరణ ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్రంలోని 28 జిల్లాలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను పరరిశీలకులుగా నియమించారు. అందులో భాగంగా అల్లూరి జిల్లాకు సీవీ.ప్రవీణ్‌ఆదిత్యను నియమించారు. ఆయన జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలిస్తారు. జిల్లాలో 11 మండలాల పరిధిలో మొత్తం 4,97,970 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 2,41,186 మంది, మహిళలు 2,56,732 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 10:40 PM