Share News

పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణ రేపు

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:39 AM

మండలంలోని పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణను ఈ నెల 24న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ రోజు శ్రీఉమాధర్మలింగేశ్వరుడు కొలువై ఉన్న పంచదార్ల ఫణిగిరి చుట్టూ భక్తులు 24 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయనున్నారు. 20 గ్రామాల మీదుగా సాగే ఈ ప్రదక్షిణిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.

పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణ రేపు
ఉమాధర్మలింగేశ్వరస్వామి కొలువై ఉన్న ఫణిగిరి పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణ రేపు

- 24 కిలోమీటర్లు సాగే ఆధ్యాత్మిక ప్రయాణం - విస్తృతంగా ఏర్పాట్లు

రాంబిల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పంచదార్ల ఫణిగిరి ప్రదక్షిణను ఈ నెల 24న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ రోజు శ్రీఉమాధర్మలింగేశ్వరుడు కొలువై ఉన్న పంచదార్ల ఫణిగిరి చుట్టూ భక్తులు 24 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయనున్నారు. 20 గ్రామాల మీదుగా సాగే ఈ ప్రదక్షిణిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటలు వరకు ఈ కార్యక్రమం జరగనుంది. శివ నామస్మరణతో పరిసరాలు మార్మోగనున్నాయి. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రదక్షిణ మార్గంలో భక్తులకు తాగునీరు, వైద్యసదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:39 AM