Share News

గెడ్డలో రోడ్డును పరిశీలించిన పీఆర్‌ అధికారులు

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:56 AM

అనకాపల్లి మండలం రేబాక, చింతనిప్పుల అగ్రహారం పరిసరాల్లో గెడ్డలు, వాగులు పూడ్చి, రోడ్డు వేస్తున్న ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు.

గెడ్డలో రోడ్డును పరిశీలించిన పీఆర్‌ అధికారులు
గెడ్డ నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీస్తున్న అధికారులు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

అనకాపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం రేబాక, చింతనిప్పుల అగ్రహారం పరిసరాల్లో గెడ్డలు, వాగులు పూడ్చి, రోడ్డు వేస్తున్న ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. ‘గెడ్డలు పూడ్చి.. రోడ్లు వేసి’ అనే శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు స్పందించారు. పీఆర్‌ ఈఈ జగదీశ్‌, డీఈ వేణుగోపాల్‌ రేబాక వచ్చి రోడ్డు పనులను పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. చెరువు, గెడ్డ భూమిలో రోడ్డు ఎలా వేస్తారని బోని భూలోకేశ్వరరావు, పాతపాటి బాబులు, బోని రాంబాబు, బచ్చలి శేఖర్‌, బచ్చలి గంగరాజు తదితరులు అధికారులను ప్రశ్నించారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులే కేటాయించారని, మరోసారి సర్వే జరిపించాలని కోరుతామని పీఆర్‌ అధికారులు బదులిచ్చారు.

Updated Date - Aug 05 , 2026 | 12:56 AM