Share News

డిసెంబరులో పొల్లూరు ఐదో యూనిట్‌ విద్యుదుత్పత్తి ప్రారంభించాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:44 PM

పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో ఐదో యూనిట్‌ డిసెంబరులో విద్యుదుత్పత్తి ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని ఏపీ జెన్‌కో హైడ్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌ ఆదేశించారు.

డిసెంబరులో పొల్లూరు ఐదో యూనిట్‌ విద్యుదుత్పత్తి ప్రారంభించాలి
పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో రెండో దశ నిర్మాణం పనులను పరిశీలిస్తున్న హైడల్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌.

ఏపీ జెన్‌కో హైడ్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌

పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్లకు ఆదేశం

పొల్లూరు, డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రాల సందర్శన

సీలేరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో ఐదో యూనిట్‌ డిసెంబరులో విద్యుదుత్పత్తి ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని ఏపీ జెన్‌కో హైడ్‌ డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం ఆయన సీలేరు కాంప్లెక్సు పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలోని రెండో దశలో రూ.530 కోట్లతో నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల పనులను పరిశీలించారు. ఈ పనుల పురోగతిపై స్థానిక సీఈ రాజారావును అడిగి తెలుసుకున్నారు. డిసెంబరులో 5వ యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించేలా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు 5వ నంబర్‌ యూనిట్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేలా ఇంజనీర్లు దృష్టి సారించాలన్నారు. అనంతరం డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రానికి చేరుకుని అక్కడ విద్యుదుత్పత్తి, యూనిట్‌ పనితీరుపై ఇంజనీర్లను ఆరా తీశారు. తర్వాత డొంకరాయి జలాశయం నుంచి పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి నీటిని విడుదల చేసే స్లూయిస్‌ గేట్లను పరిశీలించారు. గేట్లు పనితీరుపై స్థానిక ఇంజనీర్లను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో హెచ్‌పీసీ సీఈ విశ్వేశ్వరరావు, సివిల్‌ సీఈ రవీంద్రరెడ్డి, ఎస్‌ఈలు బాలకృష్ణ, కామేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, జాకీర్‌ హుస్సేన్‌, టెక్నికల్‌ ఈఈ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:44 PM