శరవేగంగా పొల్లూరు రెండవ దశ పనులు
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:45 AM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో రెండవ దశ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల (5, 6)ను రెండవ దశలో నిర్మిస్తున్నారు.
- జల విద్యుత్ కేంద్రం 5వ యూనిట్‌లో రోటర్ అమరిక
- ఈ ఏడాది చివరి నాటికి యూనిట్ వినియోగంలోకి వచ్చేలా చర్యలు
సీలేరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో రెండవ దశ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల (5, 6)ను రెండవ దశలో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం 5వ యూనిట్‌లో రోటర్‌ను జెన్‌కో ఇంజనీర్ల నిపుణులు, బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్ల పర్యవేక్షణలో అమర్చారు. విద్యుదుత్పత్తికి అత్యంత కీలకమైన 270 టన్నుల బరువు గల రోటర్‌ను క్రేన్ల సహాయంలో దిగ్విజయంగా అమర్చినట్టు సీలేరు కాంప్లెక్సు సీఈ రాజారావు తెలిపారు. 5వ యూనిట్ ను ఈ ఏడాది డిసెంబరు నాటికి వినియోగంలోకి తీసుకొచ్చేలా పనులు శరవేగంగా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సౌదా హైడల్ సీఈ విశ్వేశ్వరరావు, ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈ రమేశ్‌రెడ్డి, సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈలు బి.బాలకృష్ణ, చిన్నకామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.