మేయర్‌కు గులాబీ, కార్పొరేటర్‌కు తెలుపు రంగు...
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:00 AM
జీవీఎంసీ పరిధిలో పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందని సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు.
రెండు బ్యాలెట్ పత్రాలు ఒకే బాక్స్‌లో వేయాలి
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందని సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మేయర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు పింక్ (గులాబీ రంగు), కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు తెలుపు రంగు బ్యాలెట్ వినియోగించుకోవలసి ఉంటుదన్నారు. రెండింటినీ ఒకే బాక్సులో వేయాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేశామన్నారు. కాగా శనివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, ఇతర జోన్‌లలో ఎన్నికల మెటీరియల్ పంపిణీని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో విఫలం
ఇళ్లకు వెళ్లి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడంలో సచివాలయ సిబ్బంది విఫమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కూడా ఇవ్వలేదు. కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థుల అనుచరులే ఇంటింటికీ వెళ్లి స్లిప్పులు పంపిణీ చేశారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రానికి కలెక్టర్
గోపాలపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌లు సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్, జీవీఎంసీ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు.