నేడు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:58 AM
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం (6వ తేదీ) రద్దు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం (6వ తేదీ) రద్దు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌బీ జోషి, జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర), ఈఆర్‌వోలతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని సమీక్షిస్తారని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా ఈ సమీక్షలో పాల్గొనాల్సి వుంటుందని, అందువల్ల పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లను రద్దు చేసినట్టు ఆమె తెలిపారు.