Share News

తగ్గని పొగమంచు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:25 AM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు. బుధవారం పాడేరు మొదలుకుని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది.

తగ్గని పొగమంచు
పాడేరులో బుధవారం ఉదయం పొగమంచు

క్రమంగా పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

పాడేరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు మాత్రం తగ్గడం లేదు. బుధవారం పాడేరు మొదలుకుని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి వేళ చలి ప్రభావం చూపుతున్నాయి. బుధవారం ముంచంగిపుట్టులో 16.4, అరకులోయలో 17.0, పెదబయలులో 17.4, చింతపల్లిలో 17.5, జి.మాడుగులలో 19.9, కొయ్యూరులో 21.3, అనంతగిరిలో 21.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 02 , 2026 | 12:25 AM