Share News

కొనసాగుతున్న ముసురు

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:22 PM

మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో బుధవారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వాతావరణంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి.

కొనసాగుతున్న ముసురు
పాడేరు మెయిన్‌రోడ్డులో బుధవారం వర్షం

పాడేరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో బుధవారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వాతావరణంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. బుధవారం కొయ్యూరులో 21.6, పాడేరులో 20.7, ముంచంగిపుట్టులో 20.1, పెదబయలులో 20.0, చింతపల్లిలో 19.9, హుకుంపేటలో 19.7, డుంబ్రిగుడలో 19.6, అరకులోయలో 19.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లి, జీకేవీధిలో...

చింతపల్లి: గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. వర్షం వల్ల చింతపల్లి సంతలో వర్తకులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Updated Date - Nov 04 , 2026 | 11:22 PM