మిరియాలకు రికార్డు స్థాయి ధర
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:15 PM
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మిరియాలకు తొలిసారిగా రికార్డు స్థాయి ధర లభిస్తున్నది. ప్రైవేటు వర్తకులు కిలో రూ.700 ధరకు కొనుగోలు చేస్తున్నారు.
కిలో రూ.700
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మిరియాలకు తొలిసారిగా రికార్డు స్థాయి ధర లభిస్తున్నది. ప్రైవేటు వర్తకులు కిలో రూ.700 ధరకు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. కాఫీతో పాటు మిరియాల పంట ఆదివాసీ రైతులను ఆర్థికంగా ఆదుకుంటోంది. మిరియాల మార్కెట్ జనవరి రెండో పక్షం నుంచి మే మొదటి పక్షం వరకు జరుగుతుంది. ఈ ఏడాది మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రారంభం నుంచి గరిష్ఠ ధర పలుకుతోంది. కొచ్చిన్ మార్కెట్‌లో కిలో మొదటి రకం మిరియాలు రూ.900-1000, రెండో రకం రూ.800 ధర లభిస్తుంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా గిరిజన ప్రాంతంలో ఈ ఏడాది మార్కెట్ ప్రారంభంలోనే ప్రైవేటు వర్తకులు రూ.600 ధరకు కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం వరకు వర్తకులు కిలో మిరియాలు కిలో రూ.650కి కొనుగోలు చేయగా, మూడు రోజులుగా కిలో రూ.700 ధరకు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో మిరియాల పంట కిలోకి రూ.700 ధర లభించడం ఇదే ప్రథమం. తొలిసారిగా మిరియాల పంటకు గరిష్ఠ ధర లభించడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.