Share News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 05 , 2026 | 12:36 AM

ప్రస్తుత వాతావరణం పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. గత మూడు రోజులుగా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, సోమవారం పెదబయలు ఈదురు గాలులకు చెట్టుకూలి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్‌ టి.నిషాంతి

- కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వాతావరణం పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. గత మూడు రోజులుగా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, సోమవారం పెదబయలు ఈదురు గాలులకు చెట్టుకూలి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలోని చింతపల్లి, జీకేవీధి మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఇతర ప్రాంతాల్లో పడే సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు పడే సమయాల్లో చెట్లకింద, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలన్నారు. పశువులు, గొర్రెల కాపర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతేనే తప్పా బయటరావద్దని ఆమె సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - May 05 , 2026 | 12:36 AM