Share News

పెన్షన్‌..టెన్షన్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:43 AM

పింఛన్‌ దరఖాస్తుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల్లోని సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక పట్టాన సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ కావడం లేదు. మరోవైపు ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వం గడువిచ్చింది. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. 14వ తేదీ సోమవారం వినాయక చవితి సందర్భంగా సెలవు. దాంతో ఆ మూడు రోజులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేయడం కుదరదు. ఆ తరువాత 15,16 తేదీల్లో మాత్రమే సమయం ఉంటుంది.

పెన్షన్‌..టెన్షన్‌
సచివాలయాల్లో పింఛన్లకు దరఖాస్తుచేయడానికి వచ్చే దరఖాస్తుదారులు

కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు

16 వరకే గడువు

సచివాలయాల్లో మొరాయిస్తున్న సర్వర్లు

దరఖాస్తుదారుల ఆందోళన

12,13,14 వరుస సెలవులు

మరోవైపు కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం

తహశీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

పింఛన్‌ దరఖాస్తుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల్లోని సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక పట్టాన సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ కావడం లేదు. మరోవైపు ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వం గడువిచ్చింది. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. 14వ తేదీ సోమవారం వినాయక చవితి సందర్భంగా సెలవు. దాంతో ఆ మూడు రోజులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేయడం కుదరదు. ఆ తరువాత 15,16 తేదీల్లో మాత్రమే సమయం ఉంటుంది.

పండుగ తరువాత రెండు రోజులు మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండడంతో సర్వర్‌ జామ్‌ అయ్యే ప్రమాదం ఉందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా పింఛన్‌కు దరఖాస్తు చేయాలంటే కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఉండాలి. దరఖాస్తు అప్‌లోడ్‌ చేసే సమయంలో ఒక ధ్రువపత్రం అప్‌లోడ్‌ చేస్తేనే తదుపరి దశకు సర్వర్‌ సహకరిస్తోంది. ప్రస్తుతం కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం కొందరు తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాధారణంగా ధ్రువపత్రం జారీకి కనీసం వారం పడుతుంది. అటువంటిది వందల సంఖ్యలో దరఖాస్తుల వస్తుండడంతో మరికొంత సమయం పట్టే అవకావం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా తనిఖీలు పూర్తిచేసిన తరువాతే ధ్రువపత్రాలు జారీచేయాలని నిర్ణయించారు. ఇదిలావుండగా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే గతంలో రెవెన్యూ అధికారులు జారీచేసిన ధ్రువపత్రం నకలు లేదా ఒరిజినల్‌ సమర్పిస్తేనే కొత్తగా మరో సర్టిఫికెట్‌ ఇస్తారు. అయితే 60 ఏళ్లు దాటి కూలి పనులు చేసుకునే వారికి, భవన నిర్మాణ కార్మికులకు కుల ధ్రువీకరణ పత్రాలు దాదాపుగా ఉండవు. అటువంటి వారికి నగరంలో కొత్తగా కుల ధ్రువపత్రాలు జారీచేయడం అంత సులువు కాదని అంటున్నారు. అటువంటి వారి విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కొంతమంది బియ్యం కార్డు వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నా ఆదాయ ధ్రువపత్రం కావాలని మెసేజ్‌ వస్తోంది. వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుందామనుకున్న వారికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. భర్త చనిపోయినప్పటికీ కొందరు బియ్యం కార్డుల్లో పేరు తొలగించలేదు. రెండేళ్ల నుంచి కార్డులో చేర్పులు, మార్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసేటప్పుడు చనిపోయిన వ్యక్తి వివరాలు బియ్యం కార్డు నుంచి తొలగించకపోడంతో అప్‌లోడ్‌ కావడం లేదు. దీంతో వితంతువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బియ్యం కార్డులో తొలగింపునకు ఆప్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 01:43 AM