ఒక రోజు ముందే పింఛన్ డబ్బులు పంపిణీ
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:45 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు ఈసారి కూడా ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేస్తుంటారు.
జిల్లాలో 2,53,987 మందికి రూ.107.67 కోట్లు విడుదల
అనకాపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు ఈసారి కూడా ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేస్తుంటారు. ఈసారి మార్చి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీ శనివారమే డబ్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 2,53,987 మంది పింఛన్‌దారులకు రూ.107.67 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు అవసరమైన నిధులను శుక్రవారమే బ్యాంకుల నుంచి డ్రా చేశారు.