సకాలంలో సర్ పెండింగ్ పనులు పూర్తి
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:52 AM
ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను గడువు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. సర్‌కు సంబంధించిన ప్రక్రియలపై అధికారులతో గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిస్తుందని, ఈ క్రమంలో వాటికి సంబంధించిన పనులు పక్కాగా పూర్తి చేయాలన్నారు.
- అధికారులకు కలెక్టర్ టి.విషాంతి ఆదేశం
పాడేరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను గడువు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. సర్‌కు సంబంధించిన ప్రక్రియలపై అధికారులతో గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిస్తుందని, ఈ క్రమంలో వాటికి సంబంధించిన పనులు పక్కాగా పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఎన్నికల సిబ్బంది సమన్యయంతో ఆయా పనులు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రధానంగా ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేయాలని, ఈ ప్రక్రియ అత్యంత ప్రధానమైనదని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తి చేయాలన్నారు. సర్ ప్రక్రియలో జిల్లా అగ్రస్థానంలో ఉందని, అధికారులు, సిబ్బంది అత్యుత్తమ పని తీరుతోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలో మొత్తం 4 లక్షల 99 వేల 752 మంది ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మృతులు, డబుల్ ఓటింగ్ (అనామలీలు) వంటివి కేవలం 6,461 మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలో 28 జిల్లాల్లో అత్యల్పంగా కేవలం 1.29 శాతం అనామలీ కేసులు మన జిల్లాలో మాత్రమే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.భుజంగరావు, జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.