Share News

‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండాన్ని రూపొందించిన పెదపాటి శరత్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:48 AM

హస్త కళారంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తున్న ఎలమంచిలి మండలం ఏటికొప్పాక కళాకారుడు రూపొందించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగులతో ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేసినట్టు హస్త కళాకారుడు పెదపాటి శరత్‌ కుమార్‌ తెలిపారు.

‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండాన్ని రూపొందించిన పెదపాటి శరత్‌
తాను రూపొందించిన కళాఖండంతో శరత్‌కుమార్‌

ఐదు రోజులపాటు శ్రమించి తయారీ

విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా బహూకరణ

ఎలమంచిలి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): హస్త కళారంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తున్న ఎలమంచిలి మండలం ఏటికొప్పాక కళాకారుడు రూపొందించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగులతో ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేసినట్టు హస్త కళాకారుడు పెదపాటి శరత్‌ కుమార్‌ తెలిపారు. రామాయణ ఇతివృత్తం ఉట్టిపడేలా సీత, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయస్వామి, నారదుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వశిష్ట మహాముని, ఇతర దేవతామూర్తులతో శ్రీరామ పట్టాభిషేకం కళాఖండాన్ని రూపొందించారు. గత నెల 30వ తేదీన విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, రాష్ట్ర విద్యా శాఖా మంతి నారా లోకేశ్‌ చేతులు మీదుగా శ్రీరామ పట్టాభిషేకం కళాఖండాన్ని బహూకరించినట్టు శరత్‌ కుమార్‌ తెలిపారు. తాను ప్రత్యేకంగా రూపొందించిన ఏటికొప్పాక హస్తకళాఖండాన్ని భారత రాష్ట్రపతి గౌరవంగా స్వీకరించడం తనకు ఎంతో ఆనందంగా వుందని ఆయన అన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:48 AM