ప్రశాంతంగా పాలీసెట్
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:08 PM
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్-2026 శనివారం ప్రశాంతంగా జరిగింది.
1,343 మంది హాజరు
జేసీ శ్రీపూజ పరీక్షా కేంద్రాల సందర్శన
పాడేరు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్-2026 శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రం పాడేరులో ఆరు, చింతపల్లిలో ఒకటి మొత్తం ఏడు పరీక్షా కేంద్రాల్లో పాలీసెట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. వారిలో 1,343 మంది శనివారం జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో 349 మంది గైర్హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి, అక్కడ విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ మోడల్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.హరిబాబు, పాలీసెట్ నిర్వహణ జిల్లా సమన్వయకర్త గంగస్వామి, అధ్యాపకులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.