పవన్‌కల్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:33 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మండలంలో నందిగరువు పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్దార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
అధికారులకు పీఆర్ కమిషనర్, కలెక్టర్, ఎస్‌పీ సూచనలు
పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మండలంలో నందిగరువు పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్దార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ నడిచే ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు ఉన్న రోడ్డు మార్గం, గిరిజనులతో పవన్ కల్యాణ్ జరిపే మాటామంతి కార్యక్రమ వేదికలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని పటిష్ట భద్రతతోపాటు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజతోనూ కలెక్టర్ దినేశ్‌కుమార్ చర్చించారు. నందిగరువు గ్రామంలో పరిస్థితులు, ఉన్న సదుపాయాలపై గిరిజనులతో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ విద్యాసాగర్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.