రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:36 PM
గతానికి భిన్నంగా ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శుక్రవారం ప్రభుత్వ శ్రీకారం చుట్టింది.
తొలి రోజు 760 మందికి పంపిణీ
9 తేదీ వ రకు పంపిణీ
జిల్లాలో 7,847 మందికి అందించాలని లక్ష్యం
పాడేరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): గతానికి భిన్నంగా ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శుక్రవారం ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. కేవలం రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలను శుక్రవారం నుంచి ఈనెల 9 తేదీ వరకు గ్రామాల్లో తహశీల్దార్లు, ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులైన రైతులకు అందజేస్తున్నారు. జిల్లాలోని 11 మండలాల్లో భూముల రీసర్వే జరిగిన 169 గ్రామాల్లోని 7,847 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలి రోజు శుక్రవారం 11 మండలాల్లో 760 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గతానికి భిన్నంగా కేవలం ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే పాస్‌పుస్తకాలను తయారు చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.