అరకులోయలో పార్లమెంటరీ కమిటీ పర్యటన
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:40 AM
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ కామర్స్ సభ్యులు సోమవారం అరకులోయలో పర్యటించారు. కమిటీ చైర్‌పర్సన్ డోలా సేమ్ ఆధ్వర్యంలో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్‌ను సందర్శించారు.
అరకులోయ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ కామర్స్ సభ్యులు సోమవారం అరకులోయలో పర్యటించారు. కమిటీ చైర్‌పర్సన్ డోలా సేమ్ ఆధ్వర్యంలో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్‌ను సందర్శించారు. థింసా నృత్యాల ప్రతిమల వద్ద ఫొటోలు దిగారు. చిరుధాన్యాల స్టాల్‌ను సందర్శించి వాటి వివరాలు తెలుసుకున్నారు. జీసీసీ ఉత్పత్తులను పరిశీలించారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను గుర్తించిన పర్యాటకులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. అంతకు ముందు పాడేరు డీఎస్పీ అభిషేక్, ఎస్‌ఐ గోపాలరావుల ఆధ్వర్యంలో హరిత వ్యాలీ రిసార్టు ప్రాంగణంలో సే నో టూ డ్రగ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గంజాయి జోలికి వెళ్లవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.