Share News

ముగిసిన పరిషత్‌ నామినేషన్ల ప్రక్రియ

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:54 AM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.

ముగిసిన పరిషత్‌ నామినేషన్ల ప్రక్రియ

జడ్పీటీసీ స్థానాలకు 54

ఎంపీటీసీ స్థానాలకు 369 నామినేషన్లు

నేడు పరిశీలించనున్న అధికారులు

ఉపసంహరణకు 27 వరకు గడువు

విశాఖపట్నం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు నాలుగు జడ్పీటీసీ స్థానాలకు 38 మంది, 53 ఎంపీటీసీ స్థానాలకు 212 మంది నామినేషన్లు దాఖలుచేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో జడ్పీటీసీ పదవులకు మొత్తం 54 మంది, ఎంపీటీసీ స్థానాలకు 369 మంది నామినేషన్లు దాఖలైనట్టు పేర్కొన్నారు.

ఆనందపురం జడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి కోరాడ రాజబాబు, వానపల్లి ముత్యాలరావు, వానపల్లి లక్ష్మి, బి. మల్లికార్జునరావు, గండ్రెడ్డి స్వామినాయుడు, గండ్రెడ్డి ప్రసాద్‌, వైసీపీ నుంచి మజ్జి వెంకటరావు, బాలి జ్యోత్స్న, మజ్జి శారదా ప్రియాంక, మజ్జి ప్రదీప్‌కుమార్‌, జనసేన నుంచి ఎన్ని శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ నుంచి నిమ్మకాయల వెంకటరావు, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి వెంకట ఆదిత్యకుమార్‌ నమ్మి నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి జడ్పీటీసీ పదవికి జనసేన నుంచి గోలి అంజలి ప్రసన్న, నక్కజ్యోతి, టీడీపీ నుంచి ఎరబాల కృష్ణవేణి, గాడి అలివేణి నామినేషన్లు సమర్పించారు. పద్మనాభం మండలానికి టీడీపీ నుంచి కోరాడ సత్యవతి, పిన్నింటి రాజు, జనసేన నుంచి కె.మాధురి, వైసీపీ నుంచి కోరాడ బంగారమ్మ, బీజేపీ నుంచి తమటాపు నాగమణి, పెందుర్తి జడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున సుఖవాసి అశ్విని, సుఖవాసి అజయ్‌, కె.కనకారావు, జనసేన నుంచి బుర్రా కల్పన, నేటిపల్లి మహేశ్‌, బీజేపీ నుంచి సబ్బవరపు రాంకుమార్‌, బాలచంద్రచ వైసీపీ నుంచి కోడిగుడ్ల అశోక్‌ తేజ్‌, కోడిగుడ్ల దేవి సాంబమూర్తి నామినేషన్లు దాఖలు చేశారు.

ఎంపీటీసీ స్థానాలకు 369

జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 53 ఎంపీటీసీ స్థానాలకుగారు శుక్రవారం 212 మంది నామినేషన్లు దాఖలుచేశారు. చివరి రోజు ఆనందపురం మండలంలో 84, భీమునిపట్నంలో 47, పద్మనాభంలో 38, పెందుర్తిలో 43 నామినేషన్లు సమర్పించారని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 369 మంది నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఆనందపురం మండలం నుంచి 133 మంది, భీమిలిలో 65, పద్మనాభంలో 100, పెందుర్తి 71 మంది నామినేషన్లు సమర్పించారు. పార్టీల పరంగా అత్యధికంగా టీడీపీ నుంచి 146, వైసీపీ నుంచి 132 మంది నామినేషన్లు వేశారు. జనసేన నుంచి 61, బీజేపీ నుంచి 13, ఇండిపెండెంట్లు 11 మంది, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, ఇతర పార్టీల నుంచి ఒకరు నామినేషన్‌ వేశారు.

మండలాల వారీగా జడ్పీటీసీ స్థానాలకు మొత్తం నామినేషన్లు

మండలం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్‌ ఆమ్‌ఆద్మీ మొత్తం

ఆనందపురం 9 8 1 1 1 20

భీమునిపట్నం 2 2 3 7

పద్మనాభం 7 2 2 1 12

పెందుర్తి 5 4 3 2 1 15

మొత్తం 23 16 9 3 2 1 54

ఎంపీటీసీ స్థానాలకు మొత్తం నామినేషన్లు

మండలం టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్‌ బీఎస్పీ ఇండిపెండెంట్‌ మొత్తం

ఆనందపురం 53 45 22 5 0 0 7 133

భీమిలి 29 27 8 0 0 1 0 65

పద్మనాభం 42 40 8 6 0 1 3 100

పెందుర్తి 22 20 23 2 3 0 1 71

మొత్తం 146 132 61 13 3 2 11 369

Updated Date - Oct 24 , 2026 | 12:54 AM