Share News

పాడేరు వాసిజి.బాలకృష్ణకు ఐఏఎస్‌ హోదా

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:00 AM

ప్రస్తుతం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పని చేస్తున్న గ్రూప్‌-1 అధికారి జి.బాలకృష్ణకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పాడేరు వాసిజి.బాలకృష్ణకు ఐఏఎస్‌ హోదా
జి.బాలకృష్ణ

ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో అడిషనల్‌ ఐజీగా పని చేస్తున్న బాలకృష్ణ

పాడేరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పని చేస్తున్న గ్రూప్‌-1 అధికారి జి.బాలకృష్ణకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు ప్రాంతానికి చెందిన జి.బాలకృష్ణ గ్రూప్‌-1 అధికారిగా స్టాంపులు, రిజిసే్ట్రషన్‌ శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తూ ప్రస్తుతం అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో పాడేరుకు చెందిన జి.బాలకృష్ణ ఉన్నారు. తమ ప్రాంతానికి చెందిన అధికారికి దేశంలోనే ఉన్నతమైన ఐఏఎస్‌ హోదా దక్కడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:00 AM