Share News

పాడేరు డీఎస్‌పీ అభిషేక్‌కు బదిలీ

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:33 PM

ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఎస్‌పీ)గా పని చేస్తున్న ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ను కృష్ణ జిల్లా అవనిగడ్డకు బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పాడేరు డీఎస్‌పీ అభిషేక్‌కు బదిలీ
ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌

పాడేరు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఎస్‌పీ)గా పని చేస్తున్న ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ను కృష్ణ జిల్లా అవనిగడ్డకు బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ గతేడాది డిసెంబరు 27న స్థానిక డీఎస్‌పీగా బాధ్యతలు స్వీకరించారు. తక్కువ సమయంలోనే ఆయన ప్రజాసంబంధాలు మెరుగుపర్చుకుని, గంజాయి నిర్మూలన, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కబరిచారు. అలాగే ఆయన స్థానంలో ఇంకా ఎవర్నీ నియమించలేదు.

Updated Date - Apr 10 , 2026 | 11:33 PM