Share News

తుఫాన్‌తో ముసురు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:45 AM

‘మురసు’ తుఫాన్‌ ప్రభావంతో జిల్లా అంతటా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ తీరం దాటిన తరువాత జిల్లాలో వాతావరణం మారిపోయింది.

తుఫాన్‌తో ముసురు
మంగళవారం రాత్రి పాయకరావుపేటలో వర్షం

జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం

అనకాపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘మురసు’ తుఫాన్‌ ప్రభావంతో జిల్లా అంతటా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ తీరం దాటిన తరువాత జిల్లాలో వాతావరణం మారిపోయింది. పగలంతా ఆకాశం మేఘావృతమైంది. పలు మండలాల్లో దఫదఫాలుగా వర్షం కురుస్తున్నది. కొన్నిచోట్ల జల్లులు, మరికొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలో బుధవారం కూడా వర్షాలు కురిసే అకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని, కిందిస్థాయి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.

’పేట లో భారీ వర్షం

పాయకరావుపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో పాయకరావుపేటలో మంగళవారం రాత్రి భారీ వర్షం పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చినుకులు పడగా.. రాత్రి ఏడు గంటల నుంచి సుమారు గంటపాటు కుండపోతగా వర్షం కురిసింది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెయిన్‌ రోడ్డు వర్షం నీటితో కాలువను తలపించింది.

Updated Date - Nov 04 , 2026 | 01:45 AM