Share News

జనసైనికులు, వీర మహిళల నుంచి 2,100పైగా దరఖాస్తులు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:55 AM

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో జనసైనికులు, వీర మహిళల నుంచి 2,100కుపైగా దరఖాస్తులు స్వీకరించినట్టు జనసేన పార్టీ నియోజకవర్గం పరిశీలకులు పెండెం దొరబాబు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు.

జనసైనికులు, వీర మహిళల నుంచి  2,100పైగా దరఖాస్తులు
మీడియాతో మాట్లాడుతున్న పెండెం దొరబాబు. చిత్రంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు ఉన్నారు.

సమర్థులకు పార్టీ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు

జనసేన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు దొరబాబు

అనకాపల్లి టౌన్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో జనసైనికులు, వీర మహిళల నుంచి 2,100కుపైగా దరఖాస్తులు స్వీకరించినట్టు జనసేన పార్టీ నియోజకవర్గం పరిశీలకులు పెండెం దొరబాబు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించామని, 30వ తేదీన 110 దరఖాస్తులు, ఒకటో తేదీన 377, రెండో తేదీన 482, మూడో తేదీన 762, నాలుతో తేదీన 197, ఐదో తేదీన 120 దరఖాస్తులు స్వీకరించామన్నారు. వీటిని పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తామని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించిన తరువాత పార్టీ పదవులకు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అధిష్ఠానం ఎంపిక చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ శాఖకు వన్నె తెచ్చారని కొనియాడారు. పిఠాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధికి రూ.600 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. ఆధ్యాత్మిక ప్రదేశమైన పిఠాపురంలో రూ.27 కోట్లతో ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Updated Date - Jul 06 , 2026 | 12:55 AM