జాజులబంధలో జ్వరాల విజృంభణ
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:26 PM
మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరిద్దరు జ్వరాల బారిన పడ్డారు.
రహదారి సౌకర్యం లేక ఆస్పత్రికి వెళ్లని గిరిజనులు
వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వేడుకోలు
కొయ్యూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరిద్దరు జ్వరాల బారిన పడ్డారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఆస్పత్రికి వెళ్లడం లేదు. నాటువైద్యంతో సరిపెట్టుకుంటున్నారు.
జాజులబంధ గ్రామంలో సుమారు 30 పీవీటీజీ కుటుంబాలు నివసిస్తు న్నాయి. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏ అవసరమొచ్చినా సుమారు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండ దిగి రోలుగుంట మండలం అర్ల గ్రామానికి రావాలి. వైద్య సేవల కోసమైతే అక్కడ నుంచి వాహనాల్లో 13 కిలోమీటర్లు ప్రయాణించి డౌనూరు పీహెచ్‌సీకి చేరుకోవాలి. జాజులబంధ గ్రామంలో మర్రి వెంకటరావు కుటుంబంలో అతని భార్య లక్ష్మితో పాటు పిల్లలు రాధిక, అక్షయ, ప్రియాంక, అగస్టీన్ జ్వరాల బారిన పడ్డారు. వీరితో పాటు ప్రతీ ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. కలెక్టర్ స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని డౌనూరు పీహెచ్సీ వైద్యాధికారి వినయ్‌కుమార్ దృష్టికి తీసుకు వెళ్లగా, ఇటీవలే ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అప్పటికి అందరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. మరోసారి వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.