సేంద్రీయ సాగును ప్రోత్సహించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:22 PM
జిల్లాలోని గిరిజన రైతులకు అధిక ఆదాయాన్నిచ్చే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ టి.నిశాంతి ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజన రైతులకు అధిక ఆదాయాన్నిచ్చే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగుపై ఆయా శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావే శంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో సేంద్రీయ సాగు విధానాలను మరింతగా విస్తరించేందుకు కృషి చేయాలని, రైతులకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టినా వారికి చక్కని ఆదాయం రావాలన్నదే ప్రధానమన్నారు. రైతులకు అవసరమైన శిక్షణలు, సలహాలు, సూచనలు అందిస్తూ సాంకేతికతను జోడిస్తూ వారిని సంపూర్ణంగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ప్రత్యేకమైన మ్యాప్‌ను రూపొందించాలని సూచించారు. గిరిజన రైతుల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. భూసారం, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అప్పారావు, కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో ఎల్.రమేశ్, స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బి.కల్యాణి, డీఎఫ్‌వోలు నర్సింగరావు, ఉమామహేశ్వరి, సీపీవో ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.