Share News

జిల్లా నుంచి ట్రిపుల్‌ ఐటీకి నలుగురే

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:12 PM

ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సు అయిన ట్రిపుల్‌ ఐటీకి జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

జిల్లా నుంచి ట్రిపుల్‌ ఐటీకి  నలుగురే

శ్రీకాకుళం, నూజివీడులో ఇద్దరు చొప్పున సీట్లు

పాడేరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సు అయిన ట్రిపుల్‌ ఐటీకి జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లాలో ఈ ఏడాది 7,296 మంది టెన్త్‌ విద్యార్థులకు 3,390 మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వారిలో 1,507 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ జిల్లా నుంచి కేవలం నలుగురు టెన్త్‌ పాసైన విద్యార్థులు మాత్రమే ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేయడం గమనార్హం. జిల్లా నుంచి దరఖాస్తులు చేసిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరికి శ్రీకాకుళం క్యాంపస్‌లో, మరో ఇద్దరికి నూజివీడు క్యాంపస్‌లో సీట్లు వచ్చాయి. ప్రవేశాల నేపథ్యంలో వారికి ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది.

Updated Date - Jun 13 , 2026 | 10:12 PM