Share News

కొనసాగుతున్న తిరుగు ప్రయాణాల రద్దీ

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:16 PM

సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరుగు ప్రయాణాల రద్దీ ఇంకా కొనసాగుతోంది.

కొనసాగుతున్న తిరుగు ప్రయాణాల రద్దీ
ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌

కిటకిటలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్‌, ప్రైవేటు జీపుల స్టాండ్‌

పాడేరురూరల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరుగు ప్రయాణాల రద్దీ ఇంకా కొనసాగుతోంది. మంగళవారం కూడా స్వగ్రామాల నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌, ప్రైవేటు జీపుల స్టాండ్‌ కిటకిటలాడాయి. విద్యార్థులు, వలస కూలీలు తమ గమ్యస్థానాలకు బయలుదేరడంతో రద్దీ కొనసాగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ డీఎం పి.శ్రీనివాసరావు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో ఆదాయం పెరిగింది.

Updated Date - Jan 20 , 2026 | 11:16 PM