Share News

కొనసాగుతున్న పొగమంచు

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:38 AM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కానీ పొగమంచు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శీతాకాల వాతావరణాన్ని తలపించేలా మంగళవారం దట్టంగా పొగమంచు కురిసింది.

కొనసాగుతున్న పొగమంచు
మంగళవారం ఉదయం పొగమంచులో పాడేరు ఆర్‌టీసీ బస్‌ కాంప్లెక్స్‌

పెదబయలులో 16.2 డిగ్రీలు

పాడేరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కానీ పొగమంచు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శీతాకాల వాతావరణాన్ని తలపించేలా మంగళవారం దట్టంగా పొగమంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగానే కాసింది. రాత్రి వేళల్లో ఒక మోస్తరు చలి వేసింది. మంగళవారం పెదబయలులో 16.2, ముంచంగిపుట్టులో 16.9, అరకులోయలో 17.2, చింతపల్ల్లిలో 18.1, అనంతగిరిలో 20.5, జి.మాడుగులలో 20.7, కొయ్యూరులో 21.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 18 , 2026 | 12:38 AM