కొనసాగుతున్న పొగమంచు
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:23 AM
వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం భానుడి కిరణాలు పొగమంచును చీల్చుకుంటూ పుడమిని తాకాయి.
అరకులోయలో 15.5 డిగ్రీలు
పాడేరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో పొగమంచు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం భానుడి కిరణాలు పొగమంచును చీల్చుకుంటూ పుడమిని తాకాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు పొగమంచు కమ్మేసింది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా, రాత్రి వేళల్లో చలి ప్రభావం చూపుతున్నది. సోమవారం అరకులోయలో 15.5, ముంచంగిపుట్టు, పెదబయలులో 16.3, చింతపల్లిలో 16.7, జి.మాడుగులలో 18.4, కొయ్యూరులో 18.9, అనంతగిరిలో 22.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.