Share News

అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:32 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి
కంట్రోల్‌ రూమ్‌లో సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

అధికారులు, ప్రజలకు కలెక్టర్‌ టి.నిషాంతి సూచన

జిల్లాస్థాయి కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08935-293448

నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవు

పాడేరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్ధేశించి మాట్లాడారు. జిల్లాలో ప్రతి మండలంలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని నిత్యం చైతన్యం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రస్తుతం గెడ్డలు, వాగులు దాటవద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని ఆమె సూచించారు. తాజా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నామని, ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళ మండల స్థాయి అధికారులకు ఆదే శాలు జారీ చేయాలని ఆమె పేర్కొన్నారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజల అత్యవసర సౌకర్యార్ధం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08935-293448 అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:32 AM