Share News

భీష్మ ఏకాదశి సందర్భంగా నర్సీపట్నంలో లక్ష దీపారాధన

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:46 AM

భీష్మ ఏకాదశి సందర్భంగా స్థానిక షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ మిని స్టేడియంలో గురువారం రాత్రి లక్ష ప్రమిదల దీపారాధన నిర్వహించారు. శిరస్సుపై గంగ, మెడలో నాగపాము, చేతిలో త్రిశూలం ధరించిన శివుడు రూరంలో అమర్చిన ప్రమిదల్లో తైలం పోసి వందలాది మంది మహిళాభక్తులు దీపాలు వెలిగించారు.

భీష్మ ఏకాదశి సందర్భంగా నర్సీపట్నంలో లక్ష దీపారాధన
లక్ష ప్రమిదల దీపాల వెలగులో మహాశివుడి రూపం (డ్రోన్‌ ఫొటో).

నర్సీపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): భీష్మ ఏకాదశి సందర్భంగా స్థానిక షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ మిని స్టేడియంలో గురువారం రాత్రి లక్ష ప్రమిదల దీపారాధన నిర్వహించారు. శిరస్సుపై గంగ, మెడలో నాగపాము, చేతిలో త్రిశూలం ధరించిన శివుడు రూరంలో అమర్చిన ప్రమిదల్లో తైలం పోసి వందలాది మంది మహిళాభక్తులు దీపాలు వెలిగించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు ముఖ్య అతిథిలుగా హాజరై ఈ దీపోత్సవాన్ని ప్రారంభించారు. షిరిడి నాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష ప్రమిదల దీప కాంతులతో స్టేడియం ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

Updated Date - Jan 30 , 2026 | 12:46 AM