ఒక కిలో లిక్విడ్ గంజాయి పట్టివేత
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:42 AM
అరకులోయ రైల్వే స్టేషన్ వద్ద ఒక కిలో లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. శనివారం అరకులోయ ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావుతో కలిసి సీఐ విలేకర్లతో మాట్లాడారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి.
ముగ్గురు అరెస్టు.. మరొకరు పరారీ
మూడు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం
అరకులోయ, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
అరకులోయ రైల్వే స్టేషన్ వద్ద ఒక కిలో లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. శనివారం అరకులోయ ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావుతో కలిసి సీఐ విలేకర్లతో మాట్లాడారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి.
మల్కన్‌గిరి ప్రాంతం నుంచి పెదబయలు మీదుగా కారులో నలుగురు గంజాయి వ్యాపారులు లిక్విడ్ గంజాయితో అరకులోయ రైల్వే స్టేషన్‌కు వస్తున్న సమాచారం ఎస్‌ఐ మల్లేశ్వరరావుకి అందింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైల్వే స్టేషన్ వద్ద ఎస్‌ఐ, సిబ్బంది మాటు వేశారు. రైల్వే స్టేషన్ వద్దకు కారు వచ్చిన వెంటనే ఎస్‌ఐ, సిబ్బంది చుట్టుముట్టారు. కారును తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. ఈ సందర్భంగా కారులో ఉన్న నలుగురిలో ఒకరు పరారీ కాగా బల్యాగుడకు చెందిన ఆటోడ్రైవర్ హరికృష్ణ(26), కేరళకు చెందిన ముప్పెన్ పియ్యా(31), ఒడిశాకు చెందిన కిషన్ డాక్(29) అరెస్టు చేశారు. ఈ బృందం ఇప్పటికి మూడుసార్లు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ.12.5 లక్షలు ఉంటుందని సీఐ హిమగిరి, ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు. 25 కిలోల గంజాయిని లిక్విడ్ రూపంలో మారిస్తే ఒక కిలో లిక్విడ్ గంజాయి తయారవుతుందని వారు తెలిపారు.