Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:22 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అరకులోయ- అరకు మధ్య జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
డిప్పలవరపు రమేశ్‌ మృతదేహం

నలుగురికి తీవ్ర గాయాలు

బైక్‌, ఆటోను ఢీకొన్న కారు

అరకులోయ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అరకులోయ- అరకు మధ్య జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

డుంబ్రిగుడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామానికి చెందిన ఇద్దరు బైక్‌పై, నలుగురు ఆటోలో సోమవారం రాత్రి 7 గంటలకు అరకులోయ నుంచి కొర్రాయి కొత్తవలసకు వెళుతున్నారు. ఆ సమయంలో డుంబ్రిగుడ వైపు నుంచి విశాఖపట్నం వెళుతున్న కారు.. బైక్‌, ఆటోలను బలంగా ఢీకొని రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడింది. బైక్‌పై ఉన్న డిప్పలవరపు రమేశ్‌(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న సీదరి రమేశ్‌, కిల్లో చరణ్‌, పాంగి అప్పన్న, అభిషేక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్‌ మృతదేహాన్ని, అలాగే క్షతగాత్రులను అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడినా ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకోవడంతో అందులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. వీరు ముగ్గురూ సివిల్‌ ఇంజనీర్లని, ఒడిశాలోని జగదల్‌పూర్‌లో నిర్మాణ పనులు చూసుకుని వస్తున్నారని తెలిసింది. వీరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Updated Date - Aug 25 , 2026 | 12:22 AM