Share News

మరోమారు పల్లా

ABN , Publish Date - Apr 16 , 2026 | 02:10 AM

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రకటించారు.

మరోమారు పల్లా

టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా వరుసగా రెండోసారి నియామకం

జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురు జిల్లా నేతలకు స్థానం

జాతీయ ఉపాధ్యక్షులుగా దువ్వారపు, నజీర్‌

హెచ్‌ఆర్‌డీ ఇన్‌చార్జిగా వేపాడ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనసాగనున్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో పల్లాతో పాటు మొత్తం 13 మందికి స్థానం లభించింది. పల్లా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు రెండోసారి ఆయన అధ్యక్షునిగా కొనసాగనున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే పదమూడు మందిలో ఏడుగురు బీసీలు ఉన్నారు. ఓసీల నుంచి ముగ్గురు, ఎస్సీల నుంచి ఇద్దరు, మైనారిటీ నుంచి ఒకరికి చోటు దక్కింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్న దువ్వారపు రామారావు, మహ్మద్‌ నజీర్‌లను జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ ఇద్దరూ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందినవారు. ఇంకా పార్టీలో కేడర్‌ నుంచి నాయకుల వరకు శిక్షణ ఇచ్చే మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) ఇన్‌చార్జిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును నియమించారు. కొద్దినెలలుగా మంగళగిరిలో దశల వారీగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను వేపాడ చిరంజీవిరావు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా కోరాడ రాజబాబు (భీమిలి), వీఎంఆర్డీఏ చైర్మన్‌ ఎంవీ ప్రణవ్‌గోపాల్‌ (విశాఖ తూర్పు), వాసుపల్లి దానయ్య (విశాఖ దక్షిణ), పుచ్చా విజయకుమార్‌ (గాజువాక), కార్యదర్శులుగా వానపల్లి గాయత్రి ఫణికుమారి (విశాఖ దక్షిణ), దాసరి శ్రీనివాస్‌ (భీమిలి), ఈతలపాక సుజాత (విశాఖ ఉత్తర), సర్వసిద్ధి అనంతలక్ష్మి (గాజువాక), అధికార ప్రతినిధిగా సీహెచ్‌ రామ్మోహననాయుడు (విశాఖ పశ్చిమ) నియమితులయ్యారు.

Updated Date - Apr 16 , 2026 | 02:10 AM