Share News

వాడవాడలా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

ABN , Publish Date - May 28 , 2026 | 11:15 PM

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతిని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

వాడవాడలా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు
పాడేరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు

పాడేరు, మే 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతిని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పాడేరు మెయిన్‌రోడ్డులోని స్టేట్‌బ్యాంక్‌కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతపల్లిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొణతాల రత్నకుమారి, సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. అరకులోయ వాలీబాల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు బుద్ద నాగజగదీశ్వరరావు, పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర, తదితరులు పాల్గొన్నారు. అలాగే హుకుంపేట, కొయ్యూరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, గూడెంకొత్తవీధి, పెదబయలు, అనంతగిరి మండలాల్లో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.

Updated Date - May 28 , 2026 | 11:15 PM