Share News

ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడు

ABN , Publish Date - May 29 , 2026 | 12:32 AM

రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి పాటుపడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని చీడిగుమ్మలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడు
ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నమస్కరిస్తున్న చేస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

మహనీయుడి ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

గొలుగొండ, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి పాటుపడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని చీడిగుమ్మలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మ ప్రతీకని, ఆయన వ్యక్తికాదు.. శక్తి అని కొనియాడారు. రాజకీయ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి రికార్డు సృష్టించారని అన్నారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, వృద్ధులకు పింఛన్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు, పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. మండల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గొలుగొండ మండలానికి రూ.44 కోట్ల విలువై 353 అభిృద్ధి పనులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్‌, జిల్లా ఉపాధ్యక్షడు అడిగర్ల అప్పలనాయుడు, నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 12:32 AM