Share News

పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:19 AM

మూడో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. విశాఖ జిల్లాలో 79 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు 21వ తేదీ నుంచి 23 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబరు రెండో తేదీన ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో మొత్తం 79 పంచాయతీలు ఉన్నాయి. అయితే ప్రతి పంచాయతీలో కాకుండా రెండు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలకు ఒకచోట నామినేషన్ల స్వీకరణ చేపడతారు.

పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్‌

21 నుంచి నామినేషన్లు స్వీకరణ

డిసెంబరు 2న పోలింగ్‌

జిల్లాలో 79 గ్రామ పంచాయతీలు

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

మూడో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. విశాఖ జిల్లాలో 79 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు 21వ తేదీ నుంచి 23 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబరు రెండో తేదీన ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో మొత్తం 79 పంచాయతీలు ఉన్నాయి. అయితే ప్రతి పంచాయతీలో కాకుండా రెండు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలకు ఒకచోట నామినేషన్ల స్వీకరణ చేపడతారు.

23 చోట్ల నామినేషన్లు స్వీకరణ

ఆనందపురం పంచాయతీ కార్యాలయంలో ఆనందపురం, లొడగలవానిపాలెం, పాలవలస, బంటుపల్లివారిపాలెం పంచాయతీలకు సంబంధించి, గిడిజాల పంచాయతీ కార్యాలయంలో గిడిజాల, భీమన్నదొరపాలెం, కొలవానిపాలెం, కణమాం, గొట్టిపల్లి పంచాయతీ కార్యాలయంలో గొట్టిపల్లి, కుసులవాడ, చందక, సిర్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో సిర్లపాలెం, బోని, పేకేరు, ముకుందపురం, తర్లువాడలో తర్లువాడ, పందలపాక, ముచ్చెర్ల, వెల్లంకి కల్యాణ మండపంలో వెల్లంకి, పెద్దిపాలెం, గంభీరం, వేములవలస, శొంఠ్యాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శొంఠ్యాం, గండిగుండం, మామిడిలోవ, రామవరం పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. భీమిలి మండలం చిప్పాడ స్వర్ణగ్రామ కార్యాలయంలో చిప్పాడ, పెదనాగమయ్యపాలెం, అన్నవరం, అమనాం, దాకమర్రి స్వర్ణ గ్రామ కార్యాలయంలో దాకమర్రి, బోడమెట్లపాలెం, మజ్జిపేట, నారాయణరాజుపేట, తాళ్లవలస స్వర్ణ గ్రామ కార్యాలయంలో తాళ్లవలస, రేఖవానిపాలెం, మూలకుద్దు, టి.నగరపాలెం, తాటితూరు స్వర్ణ గ్రామ కార్యాలయంలో తాటితూరు, సింగన్నబంద, మజ్జివలస, లక్ష్మీపురం పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. పద్మనాభం మండలం అనంతవరం స్వర్ణ గ్రామ కార్యాలయంలో అనంతవరం, గంధవరం, కొవ్వాడ, పెంట, బీఆర్‌ తాళ్లవలస స్వర్ణ గ్రామ కార్యాలయంలో బీఆర్‌ తాళ్లవలస, బుడ్డివలస అగ్రహారం, చిన్నాపురం, ఐనాడ, మద్ది స్వర్ణ గ్రామ కార్యాలయంలో మద్ది, బాందేవపురం, కృష్ణాపురం, పద్మనాభం స్వర్ణ గ్రామ కార్యాలయంలో పద్మనాభం, శేరిఖండం, విలాస్కవానిపాలెం, రెడ్డిపల్లి స్వర్ణ గ్రామ కార్యాలయంలో రెడ్డిపల్లి, పొట్నూరు, తునివలస, నేరేళ్లవలస, రేవిడి స్వర్ణ గ్రామ కార్యాలయంలో రేవిడి, వెంకటాపురం, పాండ్రంకి, కోరాడ పంచాయతీల సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. పెందుర్తి మండలం గుర్రంపాలెం స్వర్ణ గ్రామ కార్యాలయంలో గుర్రంపాలెం, ముదపాక, జెర్రిపోతులపాలెం స్వర్ణ గ్రామ కార్యాలయంలో జెర్రిపాతులపాలెం, చింతగట్ల, పినగాడి స్వర్ణ గ్రామ కార్యాలయంలో పినగాడి, పెదగాడి, చింతల అగ్రహారం, రాంపురం స్వర్ణ గ్రామ కార్యాలయంలో రాంపురం, గవరపాలెం, గొరపల్లి, సరిపల్లి స్వర్ణ గ్రామ కార్యాలయంలో సరిపల్లి, రాజయ్యపేట, జంగాలపాలెం, వాలిమెరక స్వర్ణ గ్రామ కార్యాలయంలో వాలిమెరక, ఎస్‌ఆర్‌ పురం పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Updated Date - Nov 19 , 2026 | 01:19 AM